- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : గత ప్రభుత్వమే ఏపీకి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంది : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నీటి వివాదానికి(Godavari Water Disputes) కారణం గత పాలకుల నిర్వాకమనేని ధ్వజమెత్తారు. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ప్రస్తుత తాము గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడడంలో ఎక్కడి వరకైనా వెళ్ళి పోరాడేందుకు సిద్ధమని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు గోదావరి జలాల కోసం తాము మాత్రమే పోరాడుతున్నట్లు ప్రచారం చేస్తున్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను రక్షించడంలో వెనుకాడటం లేదని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్(Banakacharala Link Project) ప్రణాళికపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్(GWDT) 1980 అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధమని, అనుమతులు లేకుండానే ఏపీ టెండర్లకు సిద్ధమవుతున్నదని ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR) ఆమోదం లేకుండానే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) కోరడం తప్పని, PFRను తిరస్కరించాలని డిమాండ్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంలో గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB), ఏపెక్స్ కౌన్సిల్ ద్వారా కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.






