- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివాసీలను చంపివేయడాన్ని రాష్ట్రపతి అడ్డుకోవాలి
బీజాపూర్ లో కొనసాగుతున్న హత్యకాండను , ఆదివాసీలను చంపివేయడాన్ని రాష్ట్రపతి అడ్డుకొవాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి సూర్యం సోమవారం పత్రిక ప్రకటన తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజాపూర్ లో కొనసాగుతున్న హత్యకాండను , ఆదివాసీలను చంపివేయడాన్ని రాష్ట్రపతి అడ్డుకొవాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి సూర్యం సోమవారం పత్రిక ప్రకటన తెలిపారు. చత్తీష్ ఘడ్ రాష్ట్రంలో బిజెపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసులపై, మావోయిస్టులపై భారీ ఎత్తున హత్యాకాండ ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నదని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ 5.6 లలో షెడ్యూలు ప్రాంతాల రక్షణకు రాష్ట్రపతికే అన్నిరకాల అధికారాల్ని కట్టబెట్టిందన్నారు. ఈ అమానుష, కిరాతక హత్యాకాండను భారత రాష్ట్రపతి అడ్డుకునేలా ఆదేశాలివ్వాలనీ, మా పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. జీవించే హక్కును హరిస్తున్న బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫాసిస్టు విధానాలను ఖండించాలని అన్ని వర్గాల ప్రజానీకాన్ని కోరుతున్నాం అని పేర్కోన్నారు.






