- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సామర్థ్యం ఉన్నోళ్లకే అధ్యక్ష పదవి.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది.ఈ మేరకు ప్రెసిడెంట్ ఎన్నికకు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేవిధంగా సోమవారం అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న అశావహుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) వెల్లడించారు. జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజు అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సారథి నేతృత్వంలోనే తాము స్థానిక ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సైతం విజయబావుటా ఎగురవేస్తామని కామెంట్ చేశారు. తెలంగాణ (Telangana)లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది సభ్యులతో కొనసాగుతోన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు.






