- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్ష్య సాధింపు రాజకీయాలు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై కక్ష్య పూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై కక్ష్య పూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవెల్లిలో ఉంటున్నట్లు కేసీఆర్ తెలిపినా.. నంది నగర్ నివాసం వద్ద గోడకు సీట్ నోటీసులు అంటించడం సరికాదన్నారు. తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో పొన్నం ప్రభాకర్, సమక్క జాతర సందర్భంగా మహిళా మంత్రులు సీతక్క, కొండ సురేఖలు ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రికలు అందించారని గుర్తు చేశారు. మంత్రులకు తెలిసిన విషయం పోలీసులకు, హోంమంత్రికి తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అఫిడవిట్ లో ఉన్న అడ్రస్ కు నోటీసులు పంపించామని పోలీసు వాదన సత్య దూరం అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, తనకు నోటీసులు జారీ చేసిన అడ్రస్, ఎన్నికల అఫిడవిట్ లో ఉన్న వేరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో కొండగల్ అడ్రస్ ఉందని, ఓ సందర్భంలో పోలీసులు బంజారాహిల్స్ నివాసంలో నోటీసులు అందజేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కి ఓ న్యాయం..? మాజీ సీఎం కేసీఆర్ కు ఓ న్యాయమా..? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష్య సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి త్వరలో భంగ పాటు తప్పదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోస్యం పలికారు.
విచారణ పేరిట వ్యక్తిత్వ హననం
అలీబాబా దొంగల ముఠా కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్, లిక్కర్ సీసాలా లేబుల్, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని పక్క దారి పట్టించేందుకు సిట్ పేరిట బీఆర్ఎస్ నేతల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రశ్నించే గొంతుల గొంతు నొక్కే క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్, రాజ్య సభ సభ్యుడు సంతోష్ రావు లకు నోటీసుల జారీ చేశారన్నారు. సాక్షుల పేరిట పిలిచి 7 నుంచి 9 గంటల విచారిస్తూ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, రెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.






