Congress: కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద కుటుంబం రాజకీయ హవా ముగిసినట్టే..!

by Ramesh Naini |

కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నేపథ్యం ఉన్న ఒక పెద్ద కుటుంబం రాజకీయ హవా ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది.

Congress: కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద కుటుంబం రాజకీయ హవా ముగిసినట్టే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో (Tiger Damanna) ‘టైగర్‌ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ తుంగతుర్తి ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లాలో జన్మించినా.. తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నేపథ్యం ఉన్న ఒక పెద్ద కుటుంబం రాజకీయ హవా ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది.

రాంరెడ్డి వెంకటరెడ్డి (Ramreddy Venkat Reddy), రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం పాత లింగాల గ్రామం. ఇద్దరిలో రాంరెడ్డి వెంకట‌రెడ్డి పెద్ద ఆయన తమ్ముడే నిన్న మరణించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఇద్దరి జీవితం కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు ఐదు సార్లు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. రాంరెడ్డి వెంకటరెడ్డి సుజాతనగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, పాలేరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అభిమానులు ముద్దుగా రాంరెడ్డి వెంకటరెడ్డినీ ‘టైగర్‌ వెంకట్‌రెడ్డి’ అని పిలుచుకుంటారు..

తమ్ముడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అభిమానులు ముద్దుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డినీ ‘టైగర్‌ దామన్న’ అని పిలుచుకుంటారు. వీరిద్దరి మరణంతో కాంగ్రెస్ పార్టీలో బలమైన రాజకీయ కుటుంబం హవా ముగిసిందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story