- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి ఊర్లు పయనమైన నగరవాసులు.. పోలీస్ శాఖ కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగ వేళ వరుస సెలవులు రావడంతో మహా నగరం ఖాళీగా దర్శనమివ్వనుంది. ఈ క్రమంలో పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగ వేళ వరుస సెలవులు రావడంతో మహా నగరం ఖాళీగా దర్శనమివ్వనుంది. ఈ క్రమంలో పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తుంది. ఊరికి వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా పత్రిక ప్రకటనల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక యాప్ ల ద్వారా సూచనలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మరో రెండు రోజుల్లో వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది సొంత ఊరికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా వరకు ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాలకు వలసలు వస్తుంటారు. ఈ క్రమంలో సొంతూళ్లకు వెళ్లే వారు నగరాల్లో ఉన్న తమ ఇంటికి తాళం వేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది.
సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలి
సంక్రాంతి పండుగ సమయంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాలు ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. ఈ తరుణంలో ఊర్లకు వెళ్లిన వారు సిటీ ఉన్న ఇల్లు, అపార్ట్మెంట్ లలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పడు పర్యవేక్షించుకోవాలని పోలీసు శాఖ సూచనలు చేస్తుంది. అదే విధంగా థెఫ్ట్ అలారమ్ లాంటి వాటిని వినియోగించుకోవడం ద్వారా విలువైన వస్తువుల భద్రత పెరుగుతందని , దొంగతానలకు గురైతే అప్రమత్తంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.
వరుస సెలవులు రావడంతో ఖాళీగా మారిన మహనగరం
శనివారం నుంచి వరుస సెలవులు రావడంతో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల అనే తేడా లేకుండా అందరూ సొంత ఊర్లకు బయలు దేరారు. 11వ తేదీ నుండి 19 వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఈ సారి అధిక సంఖ్యలో వెళుతున్నారు . ఇవాళ ఒక్కరోజే ఏపీకి 43,948 వాహనాలు హైదరాబాద్ నుంచి వెళ్లాయి.
పోలీస్ శాఖ అప్రమత్తం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుస సెలవులతో అందరూ ఊర్లకు వెళ్లడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ప్రత్యేక బృందాలను పెట్రోలింగ్ కు చేసేందుకు నియమించారు. ఏఆర్ సిబ్బందిని కూడా వినియోగించుకోనున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబారాబాద్ కమిషనరెట్ల్ సీపీ లు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఏరియాలో అధనంగా 10 టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఊర్లకు వెళుతున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. డయల్ 100 ద్వారా ఎప్పటికప్పడు పర్యవేక్షణ ఉంటుందని 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. డయల్ 100 కు కాల్ చేస్తే గతంలో 15 నిమిషాల పట్టేదని , ప్రస్తుతం 7 నిమిషాలలో కాల్ చేసిన ప్రాంతానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని పోలీస్ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ప్రత్యేక టీంలు పని చేస్తున్నాయి.: నరసింహ డీసీపీ క్రైమ్ సైబారాబాద్ కమీషనరేట్
సంక్రాంతి పండుగల నేపథ్యంలో వరుస సెలవులు నగరవాసులు పండుగ జరుపుకునేందుకు అధిక సంఖ్యలో వెళ్తునట్లు సమాచారం ఉంది. సైబారాబాద్ కమీషనర్ ఆదేశాల మేరకు రాత్రి సమయంలో పెట్రోలింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాం. గత వారం రోజులుగా పత్రిక ప్రకటనల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నాం. గత మూడు సంవత్సరాలో జరిగిన పండుగల సమయంలో జరిగిన దోంగతనాల ఘటన దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచాం. సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నాం. దొంగతనాలకు పాల్పడిన వారిని ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా గుర్తించే టెక్నాలజీ ఉంది. జీరో థెఫ్ట్ నమోదు అయ్యేలా పని చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ టీం లతో పాటు ప్రత్యేకంగా క్రైమ్ డిపార్ట్మెంట్ టీంలు కూడా పని చేస్తు్న్నాయి.






