Phone Tapping Case: క్లైమాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారి మెడకు ఉచ్చు తప్పదా?

by Prasad Jukanti |   (  Updated:2026-01-04 13:27:22  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

Phone Tapping Case: క్లైమాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారి మెడకు ఉచ్చు తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తాజా పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టడీ విచారణతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు (Navin Rao) నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఇవాళ సుదీర్ఘంగా ఆయనను విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నవీన్ రావుపై దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్ఐబీ మాజీ అధికారులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా నవీన్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం.

బీఆర్ఎస్ ముఖ్యనేతల మెడకు ఉచ్చు:

గత నెలలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఈ విచారణకు సంబంధించి జనవరి 16వ తేదీన సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుకు (Harish Rao) నోటీసులు రాబోతున్నాయని ఆయనను సిట్ ప్రశ్నించబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో హరీశ్‌ను ప్రతివాదిగా చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో సిట్ హరీశ్ రావుపై ఫోకస్ పెట్టబోతోందనే చర్చ జరుగుతున్న వేళ అందుకు భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఆయన్ను ప్రశ్నించడంతో ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవీన్ రావుపై ప్రశ్నలు సంధించిన సిట్ ఆయన వద్ద కీలక సమాచారం సేకరించిందని ఆయన స్టేట్ మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ లోని మరికొంత మంది ముఖ్యనేతలను విచారించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. తాజా ఎపిసోడ్‍తో ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్‍ను ఏ తీరం చేర్చబోతోంది అనేది వేచి చూడాలి.

Next Story