- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయి.
తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు మోసపోయి గోస పడతారనేది ఆనాడే కేసీఆర్ చెప్పిన మాటలు నిజమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయి.
- ఆ పార్టీని నమ్మితే మోసపోతారని కేసీఆర్ అప్పుడే చెప్పిండు..
- సకాలంలో యూరియా అందక రైతుల అరిగోస
- పాలనపై ముఖ్యమంత్రికి అవగాహన లేదు
- తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం
- మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
దిశ, పరకాల : తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు మోసపోయి గోస పడతారనేది ఆనాడే కేసీఆర్ చెప్పిన మాటలు నిజమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు .గురువారం పట్టణంలోని స్థానిక ఎఫ్ జె గార్డెన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో ఎన్నోసార్లు కేసీఆర్ రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకు కరెంటు, నీళ్లు 24 గంటలు అందించడం కోసం అనేక ప్రాజెక్టులను కట్టి రైతుల సంక్షేమ కోసం పాటుపడితే 18 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా అందించక గోసపడుతున్నారని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోవడం కారణమన్నారు. కట్టిన ప్రతి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టడం పనికిమాలిన చర్య అని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎక్కడినుండి ఎక్కడికి పోతుంది అనేది సంబంధిత మంత్రికి అవగాహన లేక మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. పరకాల నియోజకవర్గం పై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అందుబాటులో ఉండి రైతులకు సకాలంలో యూరియా అందించాలని, యూరియా కొరత లేకుండా చూసేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. 2010 --23 సంవత్సరాల లో యూరియా ఏనాడు కొరత రాలేదని ప్రజలు కాంగ్రెస్ ను పార్టీ నమ్మితే నేడు కేసీఆర్ పాలన ఏంటో అర్థమవుతుందని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పై కనీసం అవగాహన లేకపోవడం చాలా దారుణమని ,ఆయన పదవీ కనీసం ఆరు నెలలు ఉంటే కష్టమేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో వృద్ధులకు, వితంతువులకు కనీసం పింఛన్లు ఇవ్వని నీచమైన పరిపాలనని మండిపడ్డారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిఎ ఏమైనా మంత్రి నా ...ఆయన చెపితే ఎవరైనా వినాల్సిందేనా ...అసలేం జరుగుతుంది పరకాల్లో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించి యూరియా కొరత లేకుండా ఫర్టిలైజర్ షాపుల్లో ,ఆగ్రో షాపుల్లో నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టాలని ,ఫర్టిలైజర్ షాపుల్లో నిర్వాహకులు అధిక ధరలకు యూరియాను అమ్ముతుంటే పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో యూరియాను అందించకుంటే రాబోయే రోజుల్లో రైతుల పక్షాన ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని హెచ్చరించారు .యూరియాతో ఇబ్బంది పడుతున్న రైతులు మాట్లాడే మాటలు వింటున్న సిగ్గు లేదా అని అన్నారు. సోషల్ మీడియాలో వార్తలు వస్తే ప్రభుత్వం కేసులు వేస్తుందని హైకోర్టు హెచ్చరించిందని అన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలను మార్చుకొని రైతులు ఇబ్బంది పడకుండా యూరియాను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి సారంగపాణి ,మధుసూదన్ రెడ్డి ,జైపాల్ రెడ్డి నాగిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మహిళా నాయకులు కళావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






