- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha : పూసలమ్మ గాజుల గంపతో కవితక్క మురిపెం!
జనగామ జిల్లా(Jangaon District) పెంబర్తి(Pembarthilo) గ్రామం ఆలయం అమ్మవారిని దర్శించుకుని.. విశ్వకర్మల హస్తకళల కేంద్రాన్ని సందర్శించిన క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి కన్వీనర్ కవిత పూసలక్కలు తొడిగిన గాజులను వేసుకుని మురిసిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : జనగామ జిల్లా(Jangaon District) పెంబర్తి(Pembarthilo) గ్రామం ఆలయం అమ్మవారిని దర్శించుకుని.. విశ్వకర్మల హస్తకళల కేంద్రాన్ని సందర్శించిన క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి కన్వీనర్ కవిత పూసలక్కలు తొడిగిన గాజులను వేసుకుని మురిసిపోయింది. పూసలమ్మతో వ్యాపారం సాగుతున్న తీరుపై ముచ్చటించి ఆమె గాజుల బుట్టను కవిత నెత్తిన పెట్టుకుని సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చి సంబరపడింది.
పూసలమ్మతో తన సంతోషాన్ని కవిత ఎక్స్ వేదికగా పంచుకుంది. జాతి సిగలో మెరువులు సంచార బిడ్డలు..జీవన మాధుర్యపు బంధువులు..ప్రేమైక జీవన సారథులు..సాంప్రదాయ సౌందర్యపు ప్రతీకలు అంటూ కొనియాడింది. పూసలగంప పూల పుప్పొడి స్వచ్ఛతకు లోగిలి..తెలంగాణ చేతివృత్తుల చేతనం..ముత్తయిదు గాజుల మురిపెం అంటూ తన ఆనందాన్ని కవితాత్మకంగా కవిత వ్యక్తీకరించింది.
మన జనగామ పెంబర్తిలో మా పూసలోళ్ల అక్కాచెల్లెండ్లు నాకు అపురూపంగా గాజులు తొడిగిండ్రని..జయహో పూసలక్క..జయహో బీసీ అంటూ ముక్తాయించింది.






