Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించండి.. పీస్ కమిటీ డిమాండ్

by Prasad Jukanti |

నంబాళ్ల కేశవరావు సహా ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని పీస్ కమిటీ డిమాండ్ చేసింది.

Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించండి.. పీస్ కమిటీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఛత్తీస్ గఢ్ లో మే 21న జరిగిన ఎన్ కౌంటర్ లో (Chhattisgarh encounter) చనిపోయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు (Namballa Kesha Rao) సహా మావోయిస్టులందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పాలని పీస్ కమిటీ (Peace Committee) ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మృతదేహాలన్నింటిని వారి కుటుంబాలకు వెంటనే అందజేయాలని, కుటుంబ సభ్యులు, అంబులెన్స్ డ్రైవర్లు, సహాయంగా వచ్చిన వారిపై అన్ని రకాల వేధింపులను ఆపాలని కోరింది. మృతుల గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ, న్యాయపర, అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని, దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో మరణించిన వారి మృతదేహాలతో వ్యవహరిచడానికి చట్టపరమైన ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పీస్ కో ఆర్టినేషన్ కమిటీ తరఫున ప్రొ.హరగోపాల్, ప్రొ.జి లక్ష్మణ్, డా. ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి ఇవాళ పత్రిక ప్రకటన విడుదల చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత వారి కుటుంబీకులకు అప్పగిస్తామని ఛత్తీస్ గఢ్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు వాటిని అప్పగించలేదని ఇది ఆందోళనకరం అని అన్నారు.

మృతదేహాలను కుళ్లిపోయేలా చేస్తున్నారు:

మృతదేహంతో గౌరవప్రదంగా వ్యవహరిచాలనే హక్కు ఉల్లంఘిస్తోందని, మృతదేహాలను గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన,నైతిక బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరచకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ పేర్కొంది. ఇలా వ్యవహరించడం వైద్య, చట్ట పమైన ప్రోటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని మరణించిన వ్యక్తితో అమానవీయంగా వ్యవహరించడం, విషాదంలో ఉన్న కుటుంబాలకు మరింత మానసిక ఆందోళనను కలిగించడమేనని పేర్కొంది. అంత్యక్రియల ఊరేగింపుల వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని పేర్కొంటూ ఇద్దరి మృతదేహాలను అప్పగించడాన్ని డిప్యూటీ సొలిసిటర్ జనలర్ వ్యతిరేకించడం మాకు చాలా బాధ కలిగించిందని పీస్ కమిటీ పేర్కొంది. సంతాపాన్ని నేరంగా పరిగణించే ఈ సమర్థన దుర్మార్గ మైనదని రాజ్యాంగానికి వ్యతిరేకమని తెలిపింది. అంతిమ సంస్కారాలు చేయడానికి తాము ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నానమని కుటుంబాలు కోర్టుకు తెలిపినా ఇంకా మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదని మనుషుల దుఃఖాన్ని అడ్డుకోవడం కూడా అన్నారు.

Next Story