- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుంట్ల కవితకు లైన్ క్లియర్.. టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర
టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత ప్రకటించిన రాజకీయ పార్టీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ పేరును అధికారికంగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇటీవల మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఈనెల 25న నిర్వహించిన సభలో కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పార్టీ తన పేరును ప్రకటించారు.
అయితే, జనవరి 2026లో EC నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ ప్రజాశక్తి అంటూ మొత్తం 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. అందులో మూడో ప్రాధాన్యతగా ఇచ్చిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన అధికారిక లేఖను ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి స్వయంగా ఆమెకు అందజేశారు. దీంతో టీఆర్ఎస్ పేరు ఇప్పుడు అధికారికంగా కల్వకుంట్ల కవిత సారథ్యంలోని ‘తెలంగాణ రక్షణ సేన’ సొంతం కావడంతో బీఆర్ఎస్‌కు కాస్త ఇబ్బందికరంగా మారినట్లైంది.






