- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ ఊరుకోదు.. కొండా మురళికి ఎమ్మెల్యే నాయిని కౌంటర్
ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే పార్టీ ఊరుకోదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali)కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) స్ట్రాంగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే పార్టీ ఊరుకోదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali)కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) స్ట్రాంగ్ ఇచ్చారు. ఇవాళ వరంగల్ (Warangal)లో కొండా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి (Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, బస్వరాజు సారయ్య, సుధారాణి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేతలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. కులం కార్డు అడ్డు పెట్టకుని నచ్చినట్లుగా మాట్లాడుతామంటే కుదరదని.. అలా చేస్తే పాపాలు పోతాయా అంటూ కొండా మురళిని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని అన్నారు. ఇలా అడ్డగోలుగా రోడ్లపై మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ పాపాలను తాము ఎక్కువ కాలం మోయలేమని స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో గొడవ పెట్టాలని చూస్తున్నారని.. ఇందులో తాడోపేడో తేల్చాల్సిందేనని అన్నారు. పార్టీకి నష్టం కలుగుతుంటే తమకు బాధ కలుగుతోందని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని, అందరం కలిసి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
పరిశీలకులను నియమిస్తాం.. పీసీసీ
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో కొత్త అలజడిని సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై త్వరలోనే పరిశీలకులను నియమిస్తామని పీసీసీ (PCC) కార్యాలయం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. పరిశీలకులు ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
కొండా మురళి ఏమన్నారంటే..
వరంగల్ (Warangal)లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) బర్త్ డే సెలబ్రేషన్‌కు హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత బరిలో ఉంటుందని ప్రకటించారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరంగల్‌లో కొంతమంది నాయకులు టీడీపీలో పదవులు అనుభవించి తర్వాత ఆ పార్టీని భ్రష్టు పట్టించారని కామెంట్ చేశఆరు. మళ్లీ బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్, కేటీఆర్‌లను తప్పుదోవ పట్టించి వారిని కూడా నాశనం చేశారని అన్నారు. అందులో ఒకరు గతంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు తన దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారని.. అదే వ్యక్తి ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారని కొండా మురళి అన్నారు.






