Love marriage: ప్రేమ వివాహం చేసుకున్న కన్నకూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్

by Prasad Jukanti |   (  Updated:2025-09-26 12:02:47  IST  )

తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్ చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది.

Love marriage: ప్రేమ వివాహం చేసుకున్న కన్నకూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం (Love Marriage) చేసుకుందని కన్న కూతుర్ని తల్లిదండ్రులు కిడ్నాప్ (daughter kidnap) చేసిన ఘటన మేడ్చల్ (Medchal) జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కీసర మండలం నర్సంపల్లికి చెందిన ప్రవీణ్, శ్వేత నాలుగు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఇష్టం లేని శ్వేత తల్లిదండ్రులు, బంధువులు ఇవాళ ప్రవీణ్ ఇంటికి వచ్చి శ్వేతను కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రవీణ్ కుటుంబ సభ్యులపై కారం పొడి చల్లి, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కిడ్నాప్ కు సంబంధించిన విజువల్స్ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై ప్రవీణ్ పోలీసుకు ఫిర్యాదు చేశారు.

ఆనారోగ్యం కారణంగా ఇంటికి:

నాలుగు నెలల క్రితం వివాహం జరిగినా శ్వేత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నామని ప్రవీణ్ చెప్పాడు. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవలే తమ ఇంటికి వచ్చామని ఈ విషయం తెలుసుకుని శ్వేత కుటుంబ సభ్యులు నిన్ననే తమపై దాడి చేశారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇవాళ వచ్చి ఎంక్వయిరీకి వస్తామని చెప్పారని దీంతో ఇవాళ శ్వేత బంధువులు తమపై దాడి చేసి శ్వేతను కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చాడు.

Next Story