- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక అమ్మను కలవలేననే బాధొక్కటే ఉంది.. ఎమోషనల్ అయిన కవిత
మీడియా మేనేజ్‌మెంట్‌లో హరీష్‌రావు (Harish Rao) సూపరని కల్వకుంట్ల కవిత (Kavitha) సెటైర్లు వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మీడియా మేనేజ్‌మెంట్‌లో హరీష్‌రావు (Harish Rao) సూపరని కల్వకుంట్ల కవిత (Kavitha) సెటైర్లు వేశారు. ఇవాళ ఆమె జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ (KTR) పర్ఫెక్ట్‌గా యూట్యూబ్‌ను మేనేజ్ చేస్తే.. హరీష్ రావు మీడియాను జస్ట్ మేనేజ్ చేస్తున్నాడని.. ఇక్కడే ఆయన నక్కజిత్తులను గమనించాలని అన్నారు. తన సిబ్బంది ఫోన్లతో పాటు కేటీఆర్ స్టాఫ్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని. దాని వెనుక హరీష్ రావు, సంతోష్ రావులు ఉన్నారని ఆరోపించారు. చివరికి కుటుబంలోనూ తనకు అవమానాలు జరిగాయని, అవన్నీ ఇప్పుడు మీడియా ముందు చెప్పలేనని పేర్కొన్నారు. ఏ పార్టీ తనకు అవసరం లేదని.. ఇతర పార్టీల్లోనూ చేరబోనని స్పష్టం చేశారు. బీసీ బిడ్డలు.. సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులు, జాగృతి నాయకులు కార్యకర్తలతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. తనకు మొండి ధైర్యం, ఆత్మస్థైర్యం గల మనిషినని తెలిపారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని, ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవి కూడా తనకు అక్కర్లేదని కామెంట్ చేశారు. తనకు జన్మనిచ్చిన అమ్మను కలవలేకపోతున్నాననే బాధొక్కటే ఉందని కవిత ఎమోషనల్ అయ్యారు.






