Shobhayatra : కొనసాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లో శ్రీరామనవమి(Srirama Navami) సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర(Shobhayatra) వైభవంగా కొనసాగుతోంది.

Shobhayatra : కొనసాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో శ్రీరామనవమి(Srirama Navami) సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర(Shobhayatra) వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళ్‌హాట్(Mangalhat) ప్రాంతంలోని సీతారాం భాగ్(Seethamram Bhag) నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. కాగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కి.మీ మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.

ఈ శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Command Control Center) నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.

Next Story