తీవ్ర ఉత్కంఠ.. మూడు గంటలకు పైగా కొనసాగుతున్న కేసీఆర్ సిట్ విచారణ

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తీవ్ర ఉత్కంఠ.. మూడు గంటలకు పైగా కొనసాగుతున్న కేసీఆర్ సిట్ విచారణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం కేసీఆర్ (KCR) విచారణ కొనసాగుతోంది. నందినగర్‍లోని ఆయన నివాసంలోనే సిట్ (SIT) అధికారులు దాదాపు 3 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారులు, రాజకీయ నాయకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్ ను ప్రస్నిస్తూ ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్లు సమాచారం. 'పెద్దాయన' ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని పలువురు అధికారులు విచారణలో చెప్పడంతో ఆ పెద్దాయన మీరేనా? మీ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ లో మీ ప్రమేయం ఏంటి అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కేసీఆర్ ను సిట్ విచారిస్తుండగా మరోవైపు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేసీఆర్ నివాసం వద్దకు వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోపైపు సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి బీఆర్ఎస్ ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Next Story