క్రమంగా పెరుగుతున్న మహిళా ఐపీఎస్‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-15 16:21:08  IST  )

దేశ వ్యాప్తంగా మహిళ ఐపీఎస్ అధికారులు 35.63శాతం పెరిగినట్లు సర్ధార్ వల్లభబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమి(ఎస్‌వీపిఎన్‌పిఏ) డైరక్టర్ అమిత్ ఘోర్గి తెలిపారు. 77 రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఎస్‌వీపీఎన్‌పీఏలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

క్రమంగా పెరుగుతున్న మహిళా ఐపీఎస్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా మహిళ ఐపీఎస్ అధికారులు 35.63శాతం పెరిగినట్లు సర్ధార్ వల్లభబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమి(ఎస్‌వీపిఎన్‌పిఏ) డైరక్టర్ అమిత్ ఘోర్గి తెలిపారు. 77 రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఎస్‌వీపీఎన్‌పీఏలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. 17వ తేదీన దీక్షంత్ పరేడ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరీ హజరవుతారని పేర్కొన్నారు. 2024 డిసెంబర్ 9వ తేదీన 77 ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. 174 మంది అధికారులు 45 వారాల పాటు శిక్షణ కార్యక్రమాలు జరిగినట్లు తెలిపారు.

వివిధ దేశాలకు చెందిన మరో 16మంది కూడా శిక్షణ పూర్తి చేసుకున్నట్లు 0తెలిపారు. మరో రెండు నెలల పాటు ఫేజ్ 2 బేసిక్ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. ఇన్ డోర్, అవుట్ డోర్ విధానాలలో శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నారని తెలిపారు. శిక్షణలో విభాగాల వారిగా 8మంది ట్రైనీ ఐపీఎస్ లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని వెల్లడించారు. ఎస్‌వీపిఎన్‌పిఏ ఏర్పాటు నుంచి 380 మంది విదేశీయులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరేడ్ కంమాండర్‌గా కేరళకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అంజిత్ ఏ నాయర్ అత్యత్తమ ప్రతిభ కనభరిచినట్లు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ అధికారుల సగటు వయస్సు 28 సంవత్సరాలుగా నమోదైనట్లు పేర్కొన్నారు. 174మందిలో వివాహితులు 41మంది ఉన్నట్లు తెలిపారు. వారిలో 13మంది మహిళలు వివాహితులుగా ఉన్నట్లు వివరించారు. 51మందికి వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లు తెలిపారు.

క్రమంగా పెరుగుతున్న మహిళ ఐపీఎస్‌లు

ఐపీఎస్ అధికారులలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఎస్‌వీపిఎన్‌పిఏ డైరక్టర్ అమిత్ ఘార్గి తెలిపారు. గత ఐదు సంవత్సరాలు ఈ సంఖ్య క్రమంగా మెరుగవుతుందని స్పష్టం చేశారు. 77ఆర్ఆర్ బ్యాచ్‌లో 174మందిలో 62మంది మహిళ ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలిపారు. 35.63శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

బ్యాచ్ మహిళ ట్రైని ఐపిఎస్ సంఖ్య శాతం

73ఆర్ ఆర్ 25/ 121 20.66%

74ఆర్ ఆర్ 37/166 22.29%

75ఆర్ ఆర్ 32/155 20.65%

76ఆర్ ఆర్ 54/188 28.72%

77ఆర్ ఆర్ 62/174 35.63%

అకాడమిక్ బ్యాక్ రౌండ్ లో ఇంజనీరింగ్ అభ్యర్థులు ఐపీఎస్‌కు విముఖత చూపిస్తున్నారని అమిత్ ఘార్గి తెలిపారు. సైన్స్ విద్యార్థులు, ఆర్ట్స్ విద్యార్ధులు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. గత 4సంవత్సరాల బ్యాచ్‌లలో ఇంజనీరింగ్ చేసిన వారు 68శాతం, 69శాతం, 66శాతం, 57శాతంగా ఉండేవారిని తెలిపారు. ప్రస్తుతం 50శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.

ఎడ్యుకేషన్ అభ్యర్థుల సంఖ్య శాతం

ఆర్ట్స్ 29 17%

కామర్స్ 85%

ఇంజనీరింగ్ 87 50%

లా 63%

ఎంబీబీఎస్ 85%

సైన్స్ 35. 20%

తెలంగాణకు నలుగురు ఐపీఎస్ అధికారులు

77 ఆర్ ఆర్ బ్యాచ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైని ఐపీఎస్ అధికారులలో నలుగురిని తెలంగాణకు కేటాయించారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఆయేషా ఫాతీమా, మహారాష్ట్రకు చెందిన మందారే సోహమ్ సునీల్, రాజస్థాన్‌కు చెందిన మనీషా నేహ్ర, జార్ఖండ్‌కు చెందిన రాహులు కాంత్‌లను కేటాయించారు. వీరిలో ఇద్దరు మహిళ ఐపీఎస్ ట్రైనీలు ఉన్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన అభిజిత్ పాండ్‌ను మణిపూర్, దిప్తి ఛౌహన్‌ను యూపీకి కేటాయించారు. ఏపీకి చెందిన వారు 5గురు ఉన్నారు. ఏపీ కేడర్‌కు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించారు.

అవార్డ్ విన్నర్స్

విభాగం పేరు బ్యాచ్ కేడర్

బెస్ట్ ఆఫీసర్ ట్రైనీ అంజిత్ ఏ నాయర్ 2024 తమిళనాడు

ఎస్‌వీపిఎన్‌పిఏ ట్రోఫీ కీర్తి యాదవ్ 2024 ఏజీఎంయూటీ

టోంక్ ట్రోఫీ సోహమ్ సునీల్, 2023 తెలంగాణ

నేషనల్ ఫోరెన్సెక్ సైన్స్ ట్రోఫీ ఆశ్వీనీ 2024 తమిళనాడు

మణీపూర్ కప్ వరుణ్ కె గౌడ 2023 నాగాలాండ్

ఎన్‌సీఆర్‌బీ ట్రోఫీ మనోజ్ కుమార్ 2024 మధ్య ప్రదేశ్

Next Story