నూతన పాలకవర్గాలు నిజాయితీగా పరిపాలన చేయాలి : మంత్రి జూపల్లి

by Bhoopathi Nagaiah |

మున్సిపాలిటీల్లో కొత్తగా అధికారం చేపట్టిన పాలకవర్గాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీగా పని చేయాలని మంత్రి జూపల్లి కోరారు.

నూతన పాలకవర్గాలు నిజాయితీగా పరిపాలన చేయాలి : మంత్రి జూపల్లి
X

దిశ, కొల్లాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా పరిపాలన చేయాలని, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చిన కొల్లాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌లో 19 స్థానాల్లో 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 4వేల పై చిలుకు పెద్ద మెజారిటీతో గెలుపొందారన్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు ప్రజలపైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న విశ్వాసం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలనను అందించాలని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మీరు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తూ అన్నీ రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. నూతన వరవడితో ఎక్కడ కూడా అవినీతికి తావ్వు ఇవ్వకుండా పూర్తిగా పారదర్శకత పాలన ఉండే విధంగా ఇటువంటి కక్షలు కార్పన్యాలు లేకుండా ప్రజలందరికీ పరిపాలన అందించాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నా సహకారంతో కొల్లాపూర్ పట్టణం అన్నీ రంగాల్లో అభివృద్ధిపరంగనైనా, ఆలోచనపరంగానైనా చేయనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. కొల్లాపూర్ మున్సిపల్ ఓటర్లకు, మున్సిపల్ పాలకవర్గానికి మంత్రి జూపల్లి కృతజ్ఞతలు తెలిపారు

Next Story