జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

by Prasad Jukanti |   (  Updated:2025-12-23 12:19:31  IST  )

జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరో వారం రోజుల్లో 2025 కు బై బై చెప్పేసి 2026 కు వెల్ కమ్ చెప్పబోతున్నాం. కొత్త సంవత్సరంలో తమ జీవితాల్లో మార్పులు రావాలని మనలో అనేక మంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటుంటారు. అయితే మన నిర్ణయాలు ఎలా ఉన్నా జనవరి 1 నుంచి పలు కీలక అంశాల్లో మార్పులు రాబోతున్నాయి. అమల్లోరి రానున్న కొత్త రూల్స సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.. 2026 నుంచి క్రెడిట్ రిపోర్టు అప్ డేట్ లలో కీలక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం క్రెడిట్ స్కోర్ 15 రోజులకు ఒక సారి అప్ డేట్ అవుతుంటే ఇకపై ప్రతి వారం క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల డేటాను అప్ డేట్ చేయనున్నాయి. అలాగే 2026 జనవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై నింబధనలు, పాన్ కార్డు, ఆధార్ లింకేజీపై నిబంధనలు మరింత కఠిన తరంగా అమలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం చేయకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగే అవకాశ ఉంది.

సిమ్ వెరిఫికేషన్ కంపల్సరీ:

పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేయబోతోంది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్ లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. వెరిఫికేషన్ చేశాకే వాడేలా మార్పులు చేయాలని టెలిగ్రామ్ టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి యాప్స్ కు కేంద్రం ఆదేశించింది. ఈ నిబంధనల కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ:

ఈ నెలాఖరుతో 7వ వేతన సంఘం గడువు ముగియనుంది. దీంతో జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి అవచ్చే అవకాశం ఉంది. ఇక 2026 నుంచి ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాలను పెంచడానికి సిద్దమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి.

ట్రాఫిక్ విషయంలో కొత్త నిబంధనలు:

కాలుష్య నియంత్రణలో భాగంగా పలు నగరాల్లో డీజిల్, పెట్రోల్ వాణిజ్య వాహనాలపై కొత్త ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది. ఇక అత్యంత కాలుష్యమయంగా మారిన ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాల ద్వారా డెలివరీలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

రైతులకు గంటల్లో పరిహారం:

జనవరి నుంచి యూపీ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీలు జారీ చేయనున్నారు. ఈ కార్డులు పీఎం కిసాన్ స్కీమ్ కోసం తప్పని సరి కానున్నాయి. ఈ ఐడీ లేకపోతే నగదు జగ కాకపోవచ్చు. ఇక పీఎం కిసాన్ పంట బీమా పథకం కింద అడవి జంతువుల వల్ల జరిగే నష్టం పరిహారం పొందే అర్హతను రైతులకు కల్పించనున్నారు. అయితే పంట నష్టం జరిగిన 72 గంటల్లో ఆ సమాచారం సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు:

ప్రతి నెల మాదిరిగానే వచ్చే జనవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. 1వ తేదీన సవరించిన ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించనున్నాయి. గత నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కాస్త తగ్గింది. మరో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.

Next Story