- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPIM తెలంగాణ కార్యదర్శిగా జాన్ వెస్లీ
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM Telangana) తెలంగాణ కార్యదర్శిగా జాన్‌వెస్లీ(John Wesley) ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM Telangana) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ(John Wesley) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి వేదికగా జరిగిన మహాసభల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram) రిలీవ్ అయ్యారు. దాదాపు మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో జాన్ వెస్లీకి అవకాశం ఇచ్చారు. ఈనెల 25న బహిరంగ ప్రదర్శనతో మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు.
అయితే, సీపీఐఎం(CPIM) నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) ఎన్నికవుతారని అంతా భావించారు. జూలకంటి రంగారెడ్డి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడిగా, ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా, సీఐటీయూ కార్మిక సంఘం నేతగా పనిచేశారు. దీంతో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఆయనతో పాటు సీఐటీయూ నేత అయిన ఎస్. వీరయ్యకు కూడా పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా అందరి అంచనాలు తారుమారు చేస్తూ జాన్‌వెస్లీకి బాధ్యతలు ఇచ్చారు.
ఈ మహాసభల్లో తెలంగాణలో బీజేపీ విధానాలను రాజకీయంగా ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచిఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఎం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై పోరాటం చేయాలని నిర్ణయించారు.






