Minister Seethakka : మంత్రి సీతక్క ఆవిష్కరించిన నూతన బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-18 10:48:55  IST  )

నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క(Minister Seethakka) ఆవిష్కరించి(Invented)న శిలాఫలకం(Shilapalakam)ధ్వంసమవ్వడం(Destroyed) కలకలం రేపింది.

Minister Seethakka : మంత్రి సీతక్క ఆవిష్కరించిన నూతన బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్ : నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క(Minister Seethakka) ఆవిష్కరించి(Invented)న శిలాఫలకం(Shilapalakam)ధ్వంసమవ్వడం(Destroyed) కలకలం రేపింది. ములుగు - ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన శిలాఫలకం(Tablet) ధ్వంసమైంది. గతేడాది మార్చి 16న రూ.9.50లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో శిలాఫలకం చుట్టు పిచ్చిమొక్కలు, గడ్డీ పెరిగిపోయింది. తాజాగా ఈ శిలాఫలకం ధ్వంసమవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనిని ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారా లేక ఏదైనా వాహనం తగిలి కూలిపోయిందా అన్నది తేలాల్సి ఉంది. మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం కావడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story