- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బాకీ కార్డులు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఎజెండా.. ఎవరి బాకీ ఎక్కువ..?
తెలంగాణలో కొత్తగా బాకీ కార్డుల కొత్త ఎజెండా రాజకీయం మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్తగా (Bhaki Cards) బాకీ కార్డుల కొత్త ఎజెండా రాజకీయం మొదలైంది. హామీలు వర్సెస్ బాకీలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో (Congress) కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని (BRS) బీఆర్ఎస్ పార్టీ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ అంటూ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ "బాకీ కార్డు" ను నిన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు విడుదల చేశారు. హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గాలికొదిలేసిందని ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారానికి సిద్దమైంది. ఈ బీఆర్ఎస్ విడుదల చేసిన బాకీ కార్డుకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణకు ‘బీఆర్ఎస్ ఒక బాకీ కార్డు’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ బాకీ కార్డు విడుదల చేసింది.
తెలంగాణకు బీఆర్ఎస్ ఒక బాకీ కార్డు, పదేండ్లలో తెలంగాణ నెత్తిన రూ. 8లక్షల కోట్లు బాకీ అని పేర్కొంది. (Kaleshwaram) కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల బాకీ.. నిరుద్యోగ భృతి బాకీ, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు బాకీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు బాకీ, ప్రభుత్వ ఉద్యోగాలు బాకీ, గల్ఫ్ బోర్డు బాకీ, అమరుల కుటుంబాలకు సాయం బాకీ, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు బాకీ, కేజీ టు పీజీ ఉచిత విద్య బాకీ, దళితులకు 3 ఎకరాల భూమి బాకీ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుకు చేసింది. బాకీ కార్డుల రాజకీయంలో మరి ఎవరి బాకీ ఎక్కువ..? అని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే నిర్ణయం చెబుతారని పొలిటికల్ సర్కిల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.






