- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితాలు జలసమాధి.. దేశంలో అత్యంత విషాదం నింపిన పడవ ప్రమాదాలు
జబల్‌పూర్ నర్మదా నదిలో బోటు బోల్తా పడి 9 మంది మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ఇవ్వని సిబ్బంది నిర్లక్ష్యం వీడియోలు బయటకు రావడంతో సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‍లోని జబల్‍పూర్ జిల్లా నర్మదా నదిపై జరిగిన బోటు ప్రమాదం అందరిని కలచివేస్తోంది. హాయిగా జలవిహారానికి బయలుదేరిన పర్యాటకులకు అదే ఆఖరి జర్నీగా మారింది. అకస్మాత్తుగా బలమైన గాలులు వీయడంతో బోటు నదిలోనే తిరగబడింది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది జలసమాధి కాగా మరో 28 మందిని సురక్షితంగా రక్షించారు. మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఈ బోటు ప్రమాదం వెనుక సంబంధింత సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వస్తున్న వీడియోలను బట్టి తెలుస్తోంది. బోటు ఎక్కగానే పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుటు ప్రమాదానికి గురయ్యాక హుటాహుటీన లైఫ్ జాకెట్లు అందజేస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అయితే నర్మదానది ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కాగా ఇంతకు మించిన ప్రమాదాలు మన దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అత్యంత విషాదం నింపిన ఈ ప్రమాదాలపై ఓ లుక్కేద్దాం..
-గత నెల 10న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(uttarpradesh) మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకింది. మథుర(madhura) సమీపంలోని యమునా నది(yamuna-river) లో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటం(boat-capsized) తో తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు యాత్రికులు నదిలో గల్లంతయ్యారు. సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను పడవ ఢీకొట్టడంతో బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు.
-మే-2023: కేళంలోని మలప్పురం జిల్లా తానూర్ వద్ద ఒక పర్యాటక బోటు బోల్తా పడి 22 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటం దేశవ్యాప్తంగా విషాదం నింపింది.
-జనవరి 2024: గుజరాత్‍లోని వడోదరలోని హర్సాల్ సరస్సులో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బోటు మునిగి 12 మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
-2024 ఏప్రిల్‍లో జమ్ముకశ్మీర్‍లోని జీలం నదిలో పడవ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు
కచ్చులూరు ఓ విషాద ఘటన:
బోటు ప్రమాదాలు ఎన్ని జరిగినా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు ఘటన జ్ఞాపకాలు వింటే వెన్నులో వణుకుపుట్టాల్సిందే. 15 సెప్టెంబర్ 2019న గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రకు వెళ్తున్న 'రాయల్ వశిష్ట' అనే బోటు మునిగిపోయింది. కచ్చులూరు మందంలో బోటు ఒక్కసారిగా కుదుపునకు లోనై బోటు జలసమాధి అయింది. ఈ ఘటనలో 47 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా స్థానికులు 26 మందిని కాపాడారు. ఈ ఘటనలో మునిగిపోయిన బట్ ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. చివరకు బాలాజీ మెరైన్స్ ధర్మాడి సత్యం బృందానికి అప్పగించడంతో బోటును బయటకు తీయగలిగారు.
-2018లో పాపికొండల పర్యటక బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్ల 80 మందితో వెళ్తున్న బోటులో మంటలు చెలరేగగా స్థానికుల సహాయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు .
గుణపాఠం నేర్చుకునేది ఇంకెన్నడు?:
సాంకేతిక రంగంలో ప్రపంచం ఎంత అడ్వాన్స్ గా మారినా ప్రాణాలు కోల్పోయే విషయంలో మనుషులు చేస్తున్న స్వయంకృతాపరాధాలే అనేకం ఉంటున్నాయి. పర్యాటక ప్రదేశాలలో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ బోటు సిబ్బంది లైఫ్ జాకెట్లు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇక టూరిస్టులు సైతం వీటిని అడిగి తీసుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. గతంలో ఎంతో విషాదం నింపిన బోటు ప్రమాదాలు కళ్లముందే కనిపిస్తున్నా వాటి నుంచి ఇటు సిబ్బంది, అటు పర్యటకులు గుణపాఠం నేర్చుకోలేనంత వరకు ఇలాంటి ఘటనలో ప్రాణనష్టం రెట్టింపుగానే ఉంటుందనే చర్చ జరుగుతోంది.






