పది గ్రామాలకు నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైపు లైన్‌కు చిల్లు

by Disha Web Desk 4 |
పది గ్రామాలకు నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైపు లైన్‌కు చిల్లు
X

దిశ, తాడ్వాయి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి గడప గడపకు తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన గొప్ప కార్యక్రమన్ని మిషన్ భగీరథలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సంతాయిపేట్ గ్రామ శివారులో గత వారం రోజుల నుంచి మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా నీరు వృధాగా పోతున్న మిషన్ భగీరథ అధికారులలో చలనం లేదు. గ్రామ ప్రజలు మిషన్ భగీరథ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా, నీరు వృథా అవుతున్న అటు వైపు కన్నెత్తి చూసే నాధుడే కరువయ్యాడు.

ఈ పైపు లైను ద్వారా వస్తున్న నీరు పది గ్రామాల ప్రజలకు తాగునీటికి ఉపశమనం కల్పిస్తుంది. ఓ దిక్కు ఎండలు పెరుగుతుందడంతో గ్రామాలల్లో ప్రజల దాహర్తి తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీళ్లతో సంతృప్తి చెందుతున్న ప్రజలు ఇలాంటి లికేజీలను గుర్తించకపోవడంతో ఎండాకాలంలో గ్రామాలల్లో నీటి కొరత మరింత ఏర్పడే ప్రమాదం ఉన్నది. సంతాయిపేట్ గ్రామ ప్రజలు నీరు వృధా గా వెళ్తున్నది చూసి దిశ ప్రతినిధికి సమాచారం ఇచ్చారు. దిశ ప్రతినిధి మిషన్ భగీరథ సంబంధిత అధికారులను సంప్రదించగా పైపు లైన్ లికేజి మరమ్మత్తు పనులు త్వరితగితిన పూర్తి చేసి నీరు వృథాగా వెళ్లకుండా చేస్తామని తెలిపారు. రానున్నది వేసవి కాలం అయినా గ్రామాలల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతుందని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.



Next Story

Most Viewed