- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్
by Javid Pasha |
రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి.
రాష్ట్రంలోని చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సింగరేణి ప్రాంతాల్లో ఎండ 48 డిగ్రీలు దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల వడదెబ్బతో చాలామంది పిట్టల్లా రాలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Next Story






