- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన సూచనలు, స్ఫూర్తితోనే కులగణన చేశాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే కాంగ్రెస్ జనగణనతోపాటు కులగణన చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచికగా భావించి సామాజిక న్యాయం అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బసవేశ్వరుడి గురించి ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత లేఖపై సస్పెన్స్ కొనసాగుతుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూతురు కవిత రాసిన ఉత్తరం నెట్టింట్లో వైరల్ కావడంతో దానిపైనే తీవ్ర చర్చ జరుగుతుంది. అయినా ఆ లెటర్‌పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదు. ఈ లేఖపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ, ఈ లెటర్‌పై కేటీఆర్, హరీశ్‌రావు, కవిత సైలెంట్ ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు రాజ్కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్తగిలింది. తమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ రాజ్ కెసిరెడ్డి తో పాటు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపట్టిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. అయితే ఈ పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి.
ఏపీలో మళ్లీ కొవిడ్ కేసుల నమోదు కలవరపెడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళకు కొవిడ్ నిర్థారణ అయింది. ఆమెని రిమ్స్‌లోని ఐసోలేటెడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్‌లో కొవిడ్బాధితుల కోసం మొత్తం 20 బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా సోకిన మహిళ స్వస్థలం నంద్యాల జిల్లా చాగలమర్రి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.






