- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medaram Jatara 2026 : మేడారం జాతరలో భక్తుల కోలాహలం.. ఏర్పాట్లపై సర్వత్రా హర్షం
by Taduka Kalyani |
తెలంగాణ కుంభమేళా గా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల సందడి నెలకొంది

X
దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : తెలంగాణ కుంభమేళా గా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ ఏడాది ప్రభుత్వం, అధికారులు చేసిన అత్యుత్తమ ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్వరితగతిన దర్శనం:
గత ఏళ్లతో పోలిస్తే ఈసారి దర్శనం చాలా వేగంగా జరుగుతోందని భక్తులు తెలిపారు. గతంలో 5-6 గంటలు పట్టే దర్శనం, ఈసారి కేవలం 2 గంటల్లోనే పూర్తవుతోందని మంచిర్యాల నుండి వచ్చిన భాను చందర్ దేవరకొండ దంపతులు పేర్కొన్నారు.
మెరుగైన మౌలిక వసతులు :
రోడ్ల విస్తరణ, రవాణా సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు కొనియాడారు. గోదావరిఖని నుంచి వచ్చిన పుష్ప మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది వసతులు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయని తెలిపారు.
పోలీస్ యంత్రాంగం సహకారం:
ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల క్యూ లైన్ల నిర్వహణ లో పోలీస్ యంత్రాంగం అందిస్తున్న సహకారం అభినందనీయమని విజయవాడ నుంచి వచ్చిన నిజాం మొహిద్దీన్ బృందం తెలిపింది.
గ్రామీణ భక్తుల రాక:
కాగజ్‌నగర్, బురదగూడ వంటి మారుమూల గ్రామాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 50 మందితో కలిసి బస్సులో వచ్చిన భక్తులు, జాతరలో తమకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని సంతోషం వ్యక్తం చేశారు. సమ్మక్క-సారలమ్మ తల్లులపై ఉన్న అచంచల విశ్వాసం తో ప్రతి రెండేళ్లకు ఒకసారి వస్తున్నామని, ఈసారి దర్శన ఏర్పాట్లు మరియు శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు తమకు ఎంతో తృప్తినిచ్చాయని భక్తులు ముక్తకంఠంతో చాటుతున్నారు.
Next Story






