- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊపందుకున్న ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్‌కు ప్రధాన కారణం ఆ ఘటనే?
నేడు తెలంగాణ బంద్‌కు ఆ ఘటనే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం బలంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తొలి దశ, మలిదశ, రైతంగా సాయుధ పోరాటం ఇలా ఎన్నో ఉద్యమాలు చోటుచేసుకున్న తెలంగాణలో ప్రస్తుతం మార్వాడీ గో బ్యాక్ అంటూ మరో ఉద్యమం ఊపందుకుంది. అయితే.. ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం ఒక మార్వాడీ తన కారును తీయమని అడిగిన తెలంగాణ యువకుడిని చితకబాదడంతోనే తలెత్తిందని చెబుతున్నారు.
ఎక్కడి నుంచో ఇక్కడకు బతకడానికి వచ్చిన వారు దాడులకు దిగుతున్నారంటూ సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) స్థానిక వ్యాపారుల పై, ప్రజల పై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీల దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
నేడు తెలంగాణ బంద్‌కు ప్రధాన కారణం..
తెలంగాణ బంద్‌కు ప్రధాన కారణం మోండా ఘటనే. ఇటీవల సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో పార్కింగ్ విషయంలో ఓ దళితుడిపై మార్వాడీ వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటనను ఓయూ జేఏసీ(OU JAC) చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రా పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు స్థానిక ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్ ఘటనను ఖండిస్తూ ఓయూ జేఏసీ నేడు తెలంగాణ బంద్(Telangana Bandh) కు పిలుపునిచ్చింది.






