- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లవ్ స్టోరీ.. ఆన్‌లైన్‌లో 8 నెలలు డేటింగ్
తెలుగింటి అబ్బాయి కోసం అమెరికా అమ్మాయి సముద్రాలు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి తరలివచ్చింది.

తెలుగింటి అబ్బాయి కోసం అమెరికా అమ్మాయి సముద్రాలు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి తరలివచ్చింది. సోషల్ మీడియానే ఆ జంటను కలిపింది. అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే అమ్మాయికి ఏపీకి చెందిన ఫొటోగ్రాఫర్ చందన్‌సింగ్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం జాక్లిన్ తన తల్లితో కలిసి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ఈ సందర్భంగా లవ్ స్టోరీని తెలుపుతూ జాక్లిన్ ఫోరెరో ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 45 సెకన్ల వీడియోను పోస్ట్ చేసింది. వాళ్లు లవ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రెవెన్యూ శాఖతో మాత్రమే గొడవలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాన్‌హటన్ భూమి ప్రభుత్వానిదేనని, ఆ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెల్లూరుకు చెందిన వ్యక్తికి కేటాయిచారని చెప్పారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావడం ఖాయమని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఓ గిరిజన గ్రామంలో కొందరు తుపాకులతో సంచరించడం కలకలం సృష్టించింది. ఇవాళ తెల్లవారుజామున కంట్లం గ్రామ సమీపంలో సుమారు ఎనిమిది మంది ఆరు తుపాకులతో స్థానికులకు కనిపించారు. గ్రామస్తులు భయభ్రాంతులకు గురై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారయ్యారు. అయితే వాళ్లు ఎవరు..? తుపాకులతో ఎందుకు సంచరిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు హోం మంత్రి అనిత గుడ్ న్యూస్ చెప్పారు. 10 నుంచి 15 రోజుల్లో మహిళా కార్యదర్శుల అర్హతకు తగ్గ హోదాల్లో ఉంచుతామని ప్రకటించారు. వారిలో కొందరు పోలీస్ శాఖలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, మరికొందరు ఆసక్తిగా లేరని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






