Cabinet expansion: దక్కని మంత్రి పదవి.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

by Prasad Jukanti |

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ చిచ్చురాజేసింది.

Cabinet expansion: దక్కని మంత్రి పదవి.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) చిచ్చు రాజేసింది. మంత్రిపదవి ఆశించి భంగపడిన సీనియర్ నేతలు అలకబూనారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంపై మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు రేపు బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. వారంతా పార్టీలోని తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ కు అందజేసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి అనుచరులు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధన్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. సీనియర్లను కాదాని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టచ్ లోకి అసంతృప్తులు:

మంత్రివర్గంలో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయంతో షాక్ కు గురయ్యారని ఒకరికి ఒకరు టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తమకు మినిస్టర్ హోదా రాకపోవడంపట్ల వీరంతా త్వరలో సామూహిక నిర్ణయం తీసుకునే అవకాశాలేమైనా ఉన్నాయా అనేది సస్పెన్స్ గా మారింది. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ బుజ్జగింపులు చేసినా, పెండింగ్ లో ఉన్న మరోమారు జరిగే విస్తరణలో తప్పక అవకాశం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు తమ అలక వీడటం లేదన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణమాలు మింగుడుపడని ఆసంతృప్త నేతలు రాజీనామా చేసే దిశగా సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్ కు మంత్రి పదవి ఇవ్వగా.. మంత్రిపదవి ఇస్తామన్న షరతుతోనే పార్టీలో చేరిన తనకు ఆ పోస్టు ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోలోపల రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తన జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని, మంత్రి వర్గంలో తన జిల్లా వాళ్లకు చోటు కల్పించాల్సిదేనని మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో మంత్రి వర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

Next Story