నాతో టచ్‌లో ఉన్న BRS నేతల లిస్ట్ పెద్దదే.. మరో బాంబు పేల్చిన ఎమ్మెల్సీ కవిత

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-20 06:54:10  IST  )

కొత్త పార్టీపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు.

నాతో టచ్‌లో ఉన్న BRS నేతల లిస్ట్ పెద్దదే.. మరో బాంబు పేల్చిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త పార్టీపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. ఇవాళ బంజారా‌హిల్స్‌ (Banjara Hills)లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ (KCR) వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని.. కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరే ఆలోచన అసలే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదని, తాను ఎవరినీ అప్రోచ్ కాలేదన్నారు. ముఖ్యమంత్రే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమోనని కామెంట్ చేశారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం తాను పని చేయాలనుకుంటున్నానని అన్నారు. కానీ, బీసీల సమస్య తన మనసుకు దగ్గరైందని.. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్‌నని తెలిపారు. తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. చాలామంది నేతలు వచ్చి కలుస్తున్నారని తెలిపారు. తనతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ కూడా చాలా పెద్దదేనని కల్వకుంట్ల కవిత అన్నారు.

తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని తానేనని కవిత ఛలోక్తులు విసిరారు. బీఆర్ఎస్ పభుత్వం (BRS Government) హయాంలో ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ (KTR)ను అలెర్ట్ చేశానని అన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్రావు (Harish Rao) పీసీ ఘోష్ కమిషన్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. హరీష్రావుపై తనకు ఒక్క కాళేశ్వరం (Kaleshwaram)విషయంలో తప్ప.. మరే విషయంలోనూ ఆయనపై కోపం లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేశానని, చైర్మన్ ఫార్మాట్‌లోనే తన లేఖను అందజేశానని అన్నారు. రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా కాల్ చేశానని కవిత క్లారిటీ ఇచ్చారు.

Next Story