- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Bhubharathi portal: సరికొత్తగా భూభారతి పోర్టల్.. సెకన్లలోనే యాక్సెస్!

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి (Bhubharathi) పోర్టల్ అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో భూ లావాదేవీలు, రికార్డుల నిర్వహణకు ధరణి (DHARANI) స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూబారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. పారదర్శకత, అధికార వికేంద్రీకరణ, మెరుగైన రెవెన్యూ వ్యవస్థ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి పోర్టల్‌ను ప్రారంభించారు. ఇక యూజర్లకు సెకన్లలో భూభారతి పోర్టల్ యాక్సెస్ అవుతోంది. ఇప్పటి వరకూ పోర్టల్‌ను 50 వేలకు పైగా యూజర్లు యాక్సెస్ చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ భూభారతి పోర్టల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లితో కూడిన లోగోను పొందుపరిచారు. తెలంగాణ రైసింగ్ లోగోలు ఉన్నాయి. పోర్టల్‌లోని సేవలు.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, ఆర్ఓఆర్ కరెక్షన్, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక, భూభారతి పోర్టల్ జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.