- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రెండింటినీ తలుచుకుని ఎన్నోసార్లు ఏడ్చిన కోట శ్రీనివాసరావు
సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao)కు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. తన నివాసంలో శనివారం రాత్రి ఆయన మృతి చెందారు. దీంతో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగస్టార్ చిరంజీవితో పాటు పలువురు నటుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మరికొందరు ట్వీట్టర్ వేదిక ఆయన నటనను గుర్తు తెచ్చుకుని నివాళులర్పించారు. అయితే కోట శ్రీనివాసరరావు నటనలో సవరసాలు పండించారు. విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్నలను పొందారు. ఆ నాటి నాయకుల నుంచి నేటి హీరోల సినిమాల్లోనూ ఆయన నటించారు. ఆయన నటనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది.
అయితే ఆయన మొత్తం జీవితంలో రెండు విషయాలు తలుచుకుని కోట శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో బాధపడ్డారు. మీడియా ముఖంగా కూడా పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో పిల్లలతో ఎక్కువ సేవ గడపలేకపోయాయని, ఇంటి వద్ద ఉండేందుకు సమయం సరిపోయేది కాదని, దాని వల్ల అసలు ఏం జరుగుతుందో తెలిసేకాదని కోట శ్రీనివాసరావు పలుసార్లు చెప్పుకొచ్చారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలానా పాలనా చూడలేకపోయానని చెప్పుకుని ఆవేదన చెందేవారు. తెల్లవారు జామునే షూటింగ్ వెళ్తే మళ్లీ తిరిగి వచ్చే సరికి అర్ధరాత్రి అయ్యేదని, పుట్టిన రోజులు,పెళ్లి రోజులు కూడా తనకు పట్టేవి కాదని గుర్తు చేసుకునే బాధపడేవారు.
కోట జీవితంలో రెండు అతి పెద్ద దెబ్బ ఆయన కుమారుడి మరణం. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందారు. అయితే ఆ ఘటన ఆయనకు ఎంతో బాధను మిగిల్చింది. కొడుకు మరణం కోటను ఎంతో కుంగదీసింది. చాలా సార్లు తలుచుకుని ఎన్నో వేదికల్లో కంటతడి కూడా పెట్టుకున్నారు. పితృశోకం భరించవచ్చు కాని, పుత్ర శోకం భరించలేమని బోరున విలపించేవారు. అయినా సరే తన కుటుంబం కోసం కోట శ్రీనివాసరావు నటిస్తూ వచ్చారు. చివరిగా పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటించారు. ఈ రెండు బాధలతోనే ఆయన చివరాంకం ముగిసింది.






