- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్ భూములు కృష్ణా నదీ జలాలతో తడవాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇవాళ రూ.110 కోట్లతో వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కొడంగల్ (Kodangal) మెట్ట భూములు కృష్ణా నదీ జలాలతో తడవాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revan Reddy) అన్నారు. ఇవాళ కొడంగల్ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సుమారు రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం గర్వించేలా, పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో కొడంగల్ నియోజకవర్గానికి ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇతరులను యాచించాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. కానీ ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న నాకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని కామెంట్ చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ఇక్కడ వస్తున్న మార్పులను ప్రజలు గమనించాల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కష్టపడి పనిచేసినా.. సమస్యలు తీరడం లేదు
రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా సమస్యలు పూర్తిస్థాయిలో తీరలేదని సీఎం అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు. కొడంగల్-నారాయణపేట (Kodangal-Narayanpet) ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మంత్రి శ్రీహరికి సూచించారు. వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు.






