- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది స్పెషల్.. పండుగపూట అందరినీ సంతోషపెట్టే న్యూస్
ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాల ద్వారా చిన్నారులను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పిస్తున్న కార్మికశాఖ మరో స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాల ద్వారా చిన్నారులను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పిస్తున్న కార్మికశాఖ మరో స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఇటీవల మంచిర్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్థానిక పోలీసుల సహకారంతో ఆదిలాబాద్‌లోని ఇందన్‌పల్లె గ్రామంలో ఇటుక బట్టీలో పని చేస్తున్న తొమ్మది మంది బాలకార్మికులను కార్మిక శాఖ అధికారులు రక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. పద్నాలుగేళ్ల లోపు చిన్నారులు వాహనాలు తుడవడం, టీ, కాఫీ, టిఫిన్ సెంటర్లలో పని చేస్తుండగా.. అలాంటి వారిని ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించనున్నారు.
ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాలో ఇలాంటి మీటింగ్స్, చెకింగ్స్ నిర్వహించారు. ఏప్రిల్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, పోలీస్, ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖలు పాల్గొని బాలకార్మికుల నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. హోటళ్లు, పరిశ్రమల్లో బాలబాలికలతో పని చేయిస్తే ఉపేక్షించవద్దని కార్మికశాఖ అదనపు కమిషనర్ఈ. గంగాధర్ ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లకు సూచించారు.






