- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులే లక్ష్యంగా ఐఈడీ బాంబు.. (వీడియో)
పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.

X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో, చర్ల: పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ లోని చర్ల మండలం అంజనీపురం దారిలో గురువారం మధ్యాహ్నం భద్రతా బలగాలు పోలీస్ జాగిలాలతో రూట్ మార్చ్ జరిపారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును పోలీస్ జాగిలాలు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తం అయిన బలగాలు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి దానిని నిర్వీర్యం చేయించారు. ఈ ఘటన అనంతరం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత చర్లలో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న రాజకీయ నాయకులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ బయటికు పంపించారు. అనంతరం ఆయన అక్కడ భద్రతను పర్యవేక్షించారు.
Next Story






