అమరుల త్యాగాల ఫలమే స్వరాష్ట్రం

by Elthuri vijay kumar |

అమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని రాష్ట్ర ఐ టి, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, పరిశ్రమలు అండ్ వాణిజ్యం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

అమరుల త్యాగాల ఫలమే స్వరాష్ట్రం
X

అమరుల త్యాగాల ఫలమే స్వరాష్ట్రం

- రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

- సూర్యాపేట కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

దిశ,సూర్యాపేట: అమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని రాష్ట్ర ఐ టి, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, పరిశ్రమలు అండ్ వాణిజ్యం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుదిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముందుగా మంత్రి జాతీయ పతాకావిష్కరణగావించి, పోలీస్ లచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ గీతాలాపన, రాష్ట్రీయ గీతాలాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం కోసం, అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు ఘటిస్తూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభసందర్భంగా ఈ రోజు ఇక్కడ హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కళాకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. .ఈ దేశం మన అందరిది అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉండాలని కలలు కన్న మహాత్మాగాంధీ ఆశయం, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రుల నాయకత్వం, ప్రజల సుదీర్ఘ పోరాటంతో స్వతంత్ర భారతదేశం ఏర్పాటయిందని దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిపోతే బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండిపెండెన్స్ యాక్టు కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్యానికై ఇంకా పోరాడాల్సి వచ్చిందన్నారు. ఇండియా ఇండిపెండెన్స్ యాక్టు ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారని నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య, జాగీర్దారీ విధానం, వెట్టిచాకిరి, బలవంతపు పన్నుల వసూళ్లు, రజాకార్ల దాష్టికం, ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని దీంతో నిప్పు రవ్వ అడవిని అంటుకున్నట్టు చిన్న చిన్నగా మొదలైన నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ మొత్తం వ్యాపించిందని రైతులు, మహిళలు, సకల జనులంతా ఏకమై ఆయుధాలు ధరించి, హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారని అన్నారు. హైదారాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరుగుతున్నాయని గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారని తమ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి దిగిందని దీనినే ఆపరేషన్ పోలో అని పిలిచారని తెలిపారు. ఓవైపు సాయుధ పోరాటం.. మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్లో విలీనానికి అంగీకరించి 17 సెప్టెంబర్, 1948 సాయంత్రం డెక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని నిజాం ప్రకటించారని అదే సమయంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు రాష్ట్రాలను కలపాలనే రాజకీయ ప్రతిపాదన ఒకటి ప్రారంభమైందని ఇక్కడ జరిగిన భాషోద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, ప్రజా ఆకాంక్షమేరకు ఆంధ్రరాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసిందని దీంతో 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యిందని తదుపరి ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కాంక్షను తీర్చలేదనీ, అన్యాయాలను ఆపలేకపోయాయని ఫలితంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం అయ్యి 2011 నుండి జేఏసీ నాయకత్వంలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, తీవ్ర ఉద్యమం చేశారన్నారు. తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి 42 రోజుల పాటు సకలజనుల సమ్మె చేశారని దీనితో శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను, పోరాటాలను చూసి చలించిపోయి రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమం చేస్తూ 2014 జూన్, 2 వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదేనని, అమరులత్యాగం వెలకట్టలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో అమరులైన తెలంగాణ బిడ్డలందరికి నివాళులు అర్పిస్తున్నానని వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కిలి గౌరవాన్ని ప్రకటిస్తూ ఇటీవల కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం గా నామకరణం చేయడం జరిగిందన్నారు.అలాగే హ్యాండ్ లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.అంతేకాదు, మన ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలలో కొత్త ఉద్యోగకల్పన కోసం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం జరిగిందని చెప్పారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో అమరులైన హుజూర్నగర్ కి చెందిన సోమగాని భరత్ తండ్రి అయిన కృష్ణను, కోదాడ మండలం రామలక్ష్మి పురం గ్రామానికి చెందిన అన్నెం అనిత సోదరుడు మాధవరెడ్డి, హుజూర్నగర్ మండలం మాధవరేయినిగూడెం కి చెందిన నందిగామ అంజయ్య సోదరుడు వెంకన్న, పెన్ పహాడ్ మండలం దోసపాడు గ్రామానికి చెందిన కొండేటి వేణు గోపాల్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ను, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన మీగడ సాయి సోదరుడు నాగరాజు లను మంత్రి ఘనంగా సన్మానించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి విద్యార్థులచే మంత్రి ఫొటోలు దిగుతూ వారిని ప్రోత్సహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే.నరసింహ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్,అదనపు కలెక్టర్ సీతారామారావు,అదనపు ఎస్పీ జనార్దన్, నరసింహ చారి, ఆర్డీఓ వేణుమాధవ్,జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Next Story