- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14 ఏళ్ల కంటే ఇప్పుడే అత్యధిక ఏసీబీ కేసులు: ఏసీబీ డీజీ
ఏసీబీ కేసులపై డీజీ చారు సిన్హా సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గడిచిన 14 ఏళ్లతో పోలిస్తే 2025 చివరి త్రైమాసికంలో అవినీతి నిరోధక శాఖ ఎక్కువ కేసులు నమోదు చేసిందని ఏసీపీ డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. ఏసీపీ నమోదు చేసిన కేసుల దర్యాప్తుపై ఇవాళ హైదరాబాద్ లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 చివరి త్రైమాసికంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన ఏసీబీ అధికారులు, సిబ్బందికి రివార్డ్ మేళా పేరుతో నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలతో సంత్కరించారు.ఈ రివార్డులు గుర్తింపుకే కాకుండా భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటాయని ఆమె అన్నారు. అవినీతి దేశాన్ని లోలోపలే గుల్లచేస్తోందని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు, పారదర్శక సేవలు అందించేలా అధికారులు పని చేయాలని పిలుపునిచ్చారు. దర్యాప్తులు వృత్తిపరంగా న్యయంగా సమగ్రంగా జరగడమే ఏసీబీ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. విచారణ, దర్యాప్తు నైపుణ్యాల అభివృద్ధి, కేసుల డాక్యుమెంటేషన్, సాక్ష్యాల నిర్వహణలో నాణ్యత పెంపు, దర్యాప్తులో సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగం, శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు, మెంటారింగ్ ద్వారా సంస్థాగత సామర్థ్యాల బలోపేతం దృష్టి సారించాలని సూచిచారు.






