- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం పై హైకోర్టు తీర్పు ప్రభుత్వ కుట్రలకు చెంపదెబ్బ
కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తున్న విష ప్రచారాన్ని, కుట్రలను హైకోర్టు తీర్పుతో ప్రకృతి ముఖాన కొట్టినట్లయిందని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు.

దిశ, ఏటూరు నాగారం : కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తున్న విష ప్రచారాన్ని, కుట్రలను హైకోర్టు తీర్పుతో ప్రకృతి ముఖాన కొట్టినట్లయిందని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆయన విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు భగ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను వేసిందని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా అర్థ రహితమని కోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆయన విమర్శించారు. కోర్టు తీర్పు చారిత్రాత్మకం పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరును హైకోర్టు తప్పుబట్టడం, ఆ నివేదికను నిలిపివేయడం తెలంగాణ ప్రజల విజయమని లక్ష్మణ్ బాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ కనుసన్నల్లో సాగే విచారణలకు కాలం చెల్లిందని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరమే జీవాధారం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయిని అని, అది కోట్లాది మంది రైతుల జీవనాడి అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ దార్శనికత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో దార్శనికతతో నిర్మించిన ఈ అద్భుత కట్టడాన్ని బద్నాం చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని, ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి సారించాలని లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు. సత్యమే ఎప్పుడూ గెలుస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు సగర్వంగా నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






