- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నిసార్లు చెప్పినా వినరా?.. హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్
హైడ్రా(Hydraa) అధికారుల తీరుపై హైకోర్టు(Telangana The High Court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa) అధికారుల తీరుపై హైకోర్టు(Telangana The High Court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా? ప్రశ్నల వర్షం కురిపించింది. సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (Sunday) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్‌ను కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా తనకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్(Justice K. Laxman) నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాకు మొట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) కీలక సూచన చేశారు. ఫామ్ ప్లాట్ల పేరిట అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హితవు పలికారు. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై(Farm Plots Registration) నిషేధం ఉందని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మీగూడ గ్రామ సర్వే నెంబర్ 50లోని 1.02 ఎకరాల్లో ఫామ్ ప్లాట్ల పేరిట లేఔట్ వేసి అమ్ముతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందిందని రంగనాథ్ వెల్లడించారు.
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2025
ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?
సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డ హైకోర్టు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే… pic.twitter.com/Uvcafdgorb






