శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితర సాధ్యం.. మేడే వేళ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-01 03:35:26  IST  )

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (International Labor Day) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Farmer CM KCR) కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితర సాధ్యం.. మేడే వేళ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (International Labor Day) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Farmer CM KCR) కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఆయన ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారికి దేశం పట్ల ఉన్న అంకితభావం అనితర సాధ్యమని అభివర్ణించారు. కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (State, Central Governments) నిత్యం కృషి చేయాలని కేసీఆర్ (KCR) సూచించారు.

Next Story