TSPSC చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్

by Bhoopathi Nagaiah |

టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అందులో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

TSPSC  చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అందులో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. అనంతరం టీఎస్ పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు రిజైన్ లెటర్ పంపించగా గవర్నర్ ఆమోదముద్రవేశారని ప్రచారం జరిగింది. ఇదే విషయం ఇవాళ పలు దినపత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన రాజ్ భవన్ వర్గాలు జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని వెల్లడించాయి. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరిలో ఉన్నారని, జనార్దన్ రెడ్డి రాజీనామా గవర్నర్ పరిశీలనలోనే ఉందని స్పష్టం చేశాయి.

డీవోపీటీకి గవర్నర్ లేఖ?

పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించవద్దని గవర్నర్ తమిళిసై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనార్దన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ డీవోపీటీకి తమిళిసై లేఖను సైతం రాసినట్లు సమాచారం. జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ నిర్వహించిన పలు పోటీ పరిక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ ఓడిపోవడంలో టీఎస్ పీఎస్సీ ఫెయిల్యూర్ ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారనే సమాచారంతో గత రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ ప్రాంతంలో టపాసులు కాల్చి నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు

Next Story