Prof. Haragopal : ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : ప్రొ. హరగోపాల్

by Muthe.Rajitha |

నాగర్‌కర్నూల్(Nagar Karnool) జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో మైనింగ్‌కు(Mining) వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న ఉద్యమానికి సోమవారం పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌(Prof. Haragopal) మద్దతు ప్రకటించారు.

Prof. Haragopal : ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : ప్రొ. హరగోపాల్
X

దిశ, వెబ్ డెస్క్ : నాగర్‌కర్నూల్(Nagar Karnool) జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో మైనింగ్‌కు(Mining) వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న ఉద్యమానికి సోమవారం పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌(Prof. Haragopal) మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయగా.. అనంతరం హరగోపాల్ మాట్లాడుతూ.. మైలారం గుట్టల్లో విలువైన ఖనిజాల కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అనుమతివ్వడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వదులుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ది కాదని అన్నారు. ప్రభుత్వ అనుమతులను ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గుట్టల విధ్వంసంతో స్థానిక ప్రజలు ఉపాధి కోల్పోవడంతో పాటు పర్యావరణ సమస్యలు ఏర్పడతాయన్నారు. ప్రభుత్వం తక్షణమే అనుమతులు రద్దు చేసి పునః సమీక్ష చేయాలని హరగోపాల్ డిమాండ్‌ చేశారు.

Next Story