- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం నొక్కేస్తోంది.. కల్వకుంట్ల కవిత ఫైర్
సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (కవిత) తన కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (కవిత) తన కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కవితతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, తన అరెస్ట్‌పై కల్వకుంట్ల కవిత తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణచివేస్తోందని ఆమె ఘాటుగా విమర్శించారు. ఇవాళ తన నిర్బంధం ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పట్ల పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సింగరేణిలో ఆధారిత ఉద్యోగాలను పునరుద్ధరించడం, వైద్య బోర్డును ఏర్పాటు చేయడం అనే డిమాండ్లను ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని కవిత స్పష్టం చేశారు.






