TG: ఉద్యగుల లెక్క తేల్చేపనిలో శాంతి కుమారి కమిటీ

by Gantepaka Srikanth |

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తేల్చడంలో భాగంగా పశసంవర్ధక, అటవీ శాఖలపై కసరత్తు చేయాలని కమిటీ నిర్ణయించింది.

TG: ఉద్యగుల లెక్క తేల్చేపనిలో శాంతి కుమారి కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తేల్చడంలో భాగంగా పశసంవర్ధక, అటవీ శాఖలపై కసరత్తు చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సంఖ్యపై లెక్క తెల్చేందుకు మాజీ సీఎస్ శాంతి కుమారి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఈనెల 9న నియమించింది. ఈ కమిటీ తొలిసారిగా సోమవారం ఆన్‌లైన్‌లో జరిగింది. కమిటీ తమ పని పరిధి, బాధ్యతల గురించి చర్చించింది. కమిటీ మొదటగా రెండు శాఖల్లోని ఉద్యోగుల సంఖ్యను తేల్చాలని నిర్ణయించింది.

వీటిలో పశుసంవర్ధక, పర్యావరణం, అటవీ శాఖల్లోని ఉద్యోగులను లెక్కలను తేల్చాలని నిర్ణయించింది. ఈ శాఖలలో ప్రస్తుత ఉద్యోగులు, సిబ్బంది గురించి అవసరమైన డేటాను రాబోయే రెండు రోజుల్లో ఆర్థికశాఖ సిద్ధం చేయనుంది. ఈ తరువాత కమిటీ ఈ వారంలో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ కమిటీలో మాజీ సీఎస్ శాంతి కుమారితో పాటుగా మాజీ ఐఏఎస్, ఎన్.శివశంకర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, జీఏడీ కార్యదర్శి రఘనందన్ రావులు ఉన్నారు. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story