పాలన గాలికొదిలేసి ప్రభుత్వం రాజకీయాలు.. మాజీ మంత్రి హరీష్ రావు

by Geesa Chandu |

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. పరిపాలనను గాలికొదిలేసి, రాజకీయాలు చేయడానికి మాత్రమే పరిమితమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలన గాలికొదిలేసి ప్రభుత్వం రాజకీయాలు.. మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. పరిపాలనను గాలికొదిలేసి, రాజకీయాలు చేయడానికి మాత్రమే పరిమితమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కాస్త సమయం దొరికినా, పనిగట్టుకొని మరీ.. మా పైన బురద జల్లుతోందని మండిపడ్డారు. వర్షాకాలంలో ర్తాష్ట్రం మొత్తం డెంగ్యూ, మలేరియా, గన్యా వంటి విష జ్వరాలతో వణుకుతున్నా.. ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా లేదని అన్నారు. డెంగ్యూ జ్వరాల భారిన పడి గడిచిన 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. అయితే తాము వర్షాకాలంలో విష జ్వరాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని, కానీ ప్రభుత్వం మా మాటలను పెడచెవిన పెట్టిందని వ్యాఖ్యానించారు. సకాలంలో చర్యలు తీస్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Next Story