Minister Seethakka : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎంరేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కMinister Seethakka అన్నారు.

Minister Seethakka : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎంరేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka ) అన్నారు. తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని మా ప్రభుత్వము ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా సమాఖ్యల వ్యాపార వృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళ శక్తిబజార్ ను ప్రారంభించామని, ఇక్కడ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్ట్ అప్ కంపెనీల సేల్స్ ను ఈరోజు ప్రారంభించామని గుర్తు చేశారు. మహిళ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు స్వేచ్ఛగా మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

తెలంగాణ గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుందని..అందులో భాగంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు రాజధాని హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో మహిళ సంఘాల ఉత్పత్తులు, మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులను విక్రయించేలా అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలను 17 రకాల వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని, వేయి మెగావాట్ల సౌర విద్యుత్తును మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబోతున్నామని, మహిళలకు ఉచిత ప్రయాణమే కాదు, 150 బస్సులను కూడా మహిళలకు కేటాయించబోతున్నామని తెలిపారు. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటుందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళలు అభివృద్ధి మీదే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.

మహిళా సంఘాలు తయారు చేస్తున్న సాంప్రదాయ ఉత్పత్తులను అంతా ప్రోత్సహించాలని, మహిళలు సొంతంగా తయారుచేసిన సాంప్రదాయ ఉత్పత్తులు వాడితే ఎలాంటి జబ్బులు దరిచేరవని, కొనుగోలుదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తులు తయారు చేయాలన్నారు. కుట్లు అల్లికలకే పరిమితం కాకుండా మహిళలు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని, స్వశక్తితో వారు ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు.

Next Story