- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం.. MLC కవిత నిరాహార దీక్షకు సర్వం సిద్ధం
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు సర్వం సిద్ధమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు దీక్ష పారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి జాగృతి నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. నేడు ప్రారంభం కానున్న ఈ నిరాహార దీక్ష ఈ నెల 6 వరకు అంటే 72 గంటల పాటు కొనసాగనుంది. అయితే, దీక్ష విషయంలో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగుతారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.
Next Story






