పేదల సంక్షేమమే లక్ష్యం.. బీఆర్‌ఎస్ ఆరోపణలు రాజకీయ నాటకమే : కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా రూపొందించిందని, విపక్ష సభ్యులు మాత్రం రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల సంక్షేమమే లక్ష్యం.. బీఆర్‌ఎస్ ఆరోపణలు రాజకీయ నాటకమే : కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా రూపొందించిందని, విపక్ష సభ్యులు మాత్రం రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం శాసనమండలిలో బడ్జెట్ సభ్యులు బల్మూరి వెంకట్, బొగ్గరపు దయానంద్, శంకర్ ​నాయక్ ​మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. గత బీఆర్​ఎస్ ​పాలనలో శంకుస్థాపన చేయడం తప్ప ప్రాజెక్టుల పనులు చేపట్టలేదని, గుత్తేదార్ల నుంచి కమీషన్లు మొత్తంలో తీసుకున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల కోసం పాటు పడుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తూ ప్రజల కోసం కోట్లాడుతున్నామని ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి పాలన జరిగిన అభివృద్ధి, దోపిడీ చూస్తే ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోయాయని అన్నారు.

బడ్జెట్​లో విద్య, వైద్య, సంక్షేమ రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయని, రైతులకు పెట్టుబడి సాయం, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు చేస్తే మద్దతు కల్పించామని, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ​ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇవ్వలేదన్నారు. యూరియా యాప్​తో రైతులు రోజు తరబడి బస్తాల కోసం క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా పోయిందని, ప్రతి రైతులకు యూరియా సరఫరా జరిగి, బ్లాక్​మార్కెట్​ అమ్మకాలు జరగకుండా నియంత్ర చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు కొత్త రేషన్ ​కార్డుల మంజూరుతో పాటు, నెలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేసి పేదల గుండెల్లో నిలిచామని పేర్కొన్నారు. కేసీఆర్ ​పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు, ప్రాజెక్టులో కమీషన్లు తీసుకొని కోట్లకు పడగలెత్తారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story