- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెజిట్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దుచేయాలి : ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్
జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం 1996కు, అలాగే 74వ రాజ్యాంగ సవరణ ఆత్మకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం 1996కు, అలాగే 74వ రాజ్యాంగ సవరణ ఆత్మకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. వెంటనే ఆ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సంబంధిత వర్గాలతో తగిన స్థాయిలో సంప్రదింపులు జరపకుండా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అప్రజాస్వామికమని అన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే 74వ రాజ్యాంగ సవరణ ఉద్దేశమని, అయితే.. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలు ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని సూచించారు.
డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనల ఆధారంగా జరిగినట్టు చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంటున్న సందర్భంలో, 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44,667 ఉండాలని తెలిపారు. కొన్ని వార్డుల్లో ఈ పరిమితిని మించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపైనా స్పష్టత అవసరమని, ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలతో, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు.






